క్రేజీ అందాలతో కవ్విస్తున్న అనసూయ.. మైకంలో నెటిజన్స్..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరకు దూరమై ఇప్పుడు వెండితెరకు మరింత దగ్గరయ్యింది. 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఎన్టీఆర్ నాగ మూవీ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఈమె ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు న్యూస్ ప్రజెంటర్ గా మారి మళ్ళీ జబర్దస్త్ యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ అక్కడే గ్లామర్ బ్యూటీగా పేరు దక్కించుకుంది.

ఇకపోతే సినిమాలలో సెలెక్టెడ్ గా పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్న అనసూయ.. రంగస్థలంలో రంగమ్మత్త గా, పుష్ప సినిమాలో దాక్షాయనిగా, తనకంటూ మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు చిన్న చిన్న సినిమాలలో కూడా పేరు ఉండిపోయే పాత్రలు చేస్తూ ఊహించని క్రేజ్ దక్కించుకుంటున్న అనసూయ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అలాగే తన హాట్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి క్రేజీ లుక్స్ తో.. అద్భుతంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సైతం మైకంలో తూలిపోతున్నారు. కొంటెగా కవ్విస్తూ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరింతగా ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పాలి. తాజాగా ఈమె ధరించిన డ్రెస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు మరింత వైరల్ గా మారుతోంది.