రాజేంద్రప్రసాద్ జీవితంలో కూడా ఇన్ని చీకటి రాత్రులా..?

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి నాటితరమే కాదు నేటితరం యువతకి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామెడీ పండించడంలోనూ కన్నీటిని తెప్పించడంలోనూ ఈయన తర్వాతే ఎవరైనా.. ఇకపోతే కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక తాజాగా సుమా అడ్డాలో దసరా స్పెషల్ కార్యక్రమంలో సందడి చేసిన రాజేంద్రప్రసాద్.. తన జీవితంలో జరిగిన ఎన్నో చీకటి రాత్రుల గురించి అభిమానులతో పంచుకున్నారు.

అసలు విషయంలోకి వెళితే..” కృష్ణా రామా” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ సినిమాలో నటించిన సీనియర్ నటి గౌతమి, డైరెక్టర్ రాజు మదిరాజు, రచ్చ రవి తోపాటు రాజేంద్రప్రసాద్ కూడా కలిసి వచ్చారు. ఆద్యంతం ప్రోమో మొత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ చివర్లో కన్నీళ్లు పెట్టించేలా సాగింది. ఇంతకు చూసేవారు కన్నీరుని తెచ్చుకునేలా రాజేంద్రప్రసాద్ ఏం చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

చిన్నప్పుడు దసరా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకునే వారు అంటూ తమ అనుభవాలను పంచుకోవాలని యాంకర్ సుమ కోరింది. దానికి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నేను మూడు నెలలు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ కి కూడా వెళ్లాను. అయితే నేను చచ్చిపోయే స్థితికి చేరుకున్నప్పుడు కనకదుర్గ గుడికి తీసుకెళ్లి.. ఒరేయ్ ఇంటి దగ్గర మీ అమ్మ ఉండదు కదా.. ఇక్కడే మీ అమ్మ ఉంటుంది అంటూ కనకదుర్గ అమ్మవారిని చూపించారు. ఇక ఆ దుర్గమ్మనే నేను అమ్మగా భావించి పెరిగాను అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఇక ఈ సన్నివేశం చాలా మందిని కన్నీటిని తెప్పించింది. అలా తల్లి చనిపోవడంతో తనను గుడి దగ్గరే వదిలేసి వెళ్లారు అంటూ పరోక్షంగా వెల్లడించారు రాజేంద్రప్రసాద్.