రూరల్‌లో వైసీపీ ‘రూల్’..మళ్ళీ తిరుగులేదా?

అధికార వైసీపీ ఇప్పుడు ఏపీలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం సర్వేలు చూస్తే వైసీపీదే ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైసీపీ గత ఎన్నికల్లో అన్నీ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ కాస్త వెనుకబడుతుందని తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో టి‌డి‌పి బలంగా కనబడుతోంది. అర్బన్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో టి‌డి‌పికి బలమైన ఓటింగ్ ఉంది.

అయితే రూరల్ లో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యం కనబరుస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పెద్ద ప్లస్ అవుతున్నాయి. అదే సమయంలో రూరల్ లో టి‌డి‌పి నాయకత్వం బలహీనపడుతుంది. ఇప్పటికే కొంత నాయకత్వం వైసీపీ వైపుకు వచ్చింది. దీంతో రూరల్ లో టి‌డి‌పి కంటే వైసీపీ బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో రూరల్ లో వైసీపీకి 50 శాతం పైనే బలం ఉందని తెలుస్తోంది. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉంది..అది ఏంటంటే టి‌డి‌పి-జనసేన పొత్తు. రూరల్ లో టి‌డి‌పికి 40 శాతం వరకు బలం ఉంటే..జనసేనకు 7-8 శాతం వరకు పట్టు ఉండే ఛాన్స్ ఉంది.

ఇప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తులో ముందుకెళుతున్నాయి. అలాంటప్పుడు వైసీపీకి కాస్త పోటీ ఎదురు కావచ్చు. పొత్తు సరిగ్గా వర్కౌట్ అయితేనే వైసీపీకి ఇబ్బంది. లేదంటే వైసీపీకే లాభం. టి‌డి‌పి, జనసేనల మధ్య ఓట్లు బదిలీ సరిగ్గా లేకపోతే వైసీపీకి బాగా లాభం. ఏదేమైనా రూరల్ లో మాత్రం వైసీపీదే రూల్.