భార్యకు తెలియకుండా ఆ అమ్మాయిని లవ్ చేసిన నాని.. ఇన్నాళ్లకు బయటకు వచ్చిన సీక్రెట్..!!

నాచురల్ స్టార్ నాని ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. నాని పక్కింటి కుర్రవాడిలా సరదా సరదాగా ఉంటూ అందరికీ సరదాగా సమాధానాలు చెప్తూ ఉంటాడు. మీడియా, అభిమానులు ఇలా ఎవరు ప్రశ్నించిన జన్యున్ ఆన్సర్లు చెప్తూ మన పక్కింటి కుర్రాడులా అనిపిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన నాని తాజాగా ఒక రేడియో ఛానల్ చిట్ చాట్‌లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా నాని తన మొదటి ప్రేమ గురించి వివరించాడు. నాని తన మూడవ తరగతి లోనే సోని అనే అమ్మాయితో ప్రేమలో పడ్డానని.. కానీ అమ్మాయిని చూస్తే చాలా సిగ్గు వేసిందని చెప్పుకొచ్చాడు. నేను మా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఆకులు చుట్టుకుని నిలబడ్డాన‌ని ఓ అందమైన అమ్మాయి వచ్చి నా పక్కన నిలబడిందని.. నేను అప్పుడు ఆకులతో చుట్టుకున్న డ్రెస్ వేసుకునా ఆ అమ్మాయిని పలకరించాలంటే నాకు సిగ్గు వేసింది. దాంతో ఆమెని పలకరించలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు సోనీ కనిపిస్తే ఖచ్చితంగా పలకరించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీ క్రష్ ఎవరు అని అడగగా కీయారా అద్వాని ఒకసారి షూటింగ్లో చాలా అందంగా రెడీ అయి వచ్చింది. అప్పటి నుంచి నాకు ఆమె క్రష్ అంటూ చెప్పుకోవచ్చుడు నాని. ప్రస్తుతం హాయ్ నాన్న మూవీలో నాని న‌టాస్తున్నాడు. ఇక నాని మాట్లాడుతు ఈ మూవీ షూటింగ్ బిజీగా జరుగుతుంది అని వివరించాడు. ఇందులో మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్గా నటిస్తుంది.