నటుడు రామిరెడ్డి మరణించడానికి కారణం అదేనా..?

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అంటే ప్రతి ఒక్కరికి కచ్చితంగా రామిరెడ్డినే గుర్తుకు వచ్చేవారు. ఎన్నో చిత్రాలలో రామిరెడ్డి తన నటనతో అందరిని భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన రామిరెడ్డి ఆ పాత్రలో లీనమై మరి నటిస్తూ ఉండేవారు. తన పాత్రకు 100% కచ్చితంగా న్యాయం చేయగలిగే నటులలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 250 పైగా సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు రామిరెడ్డి.

అయితే ఇలా ఎన్నో అవార్డులు అందుకున్న రామిరెడ్డి 2011 నవంబర్ 14న పలు అనారోగ్య సమస్యలతో ఈయన మరణించినట్లు తెలుస్తోంది.. సినీ ఇండస్ట్రీలోకి ఇష్టం లేకుండానే ఎంట్రీ ఇచ్చిన రామిరెడ్డి మొదట ఈయన జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అలా పని చేస్తున్న సమయంలోనే కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం ఆయనని కలవగా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి కోడి రామకృష్ణ రామిరెడ్డిని చూసి అంకుశం సినిమాలో విలన్ పాత్రని ఇవ్వడం. నటన అంటే ఏంటో తెలియని తనకు కోడి రామకృష్ణ అవకాశం ఇవ్వడంతో తన టాలెంట్ నిరూపించుకున్నారు రామిరెడ్డి.

అలా రామిరెడ్డి తెలుగులోనే కాకుండా తమిళ్, భోజ్ పురి సినిమాలలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. ఎన్నో సినిమాలలో విరామం లేకుండా నటించిన రామిరెడ్డి తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల ప్రతిరోజు కూడా మద్యాన్ని తాగుతూ ఉండేవారట. ఇలా తాగుడికి బానిస కావడం వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా రావడం జరిగిందట.ముఖ్యంగా లివర్ ఇన్ఫెక్షన్ రావడంతో క్రమంగా అది క్యాన్సర్ కు కారణమయ్యిందట చివరి రోజుల్లో చాలా నరకాన్ని అనుభవించి మరణించినట్లుగా తెలుస్తోంది రామిరెడ్డి. చివరికి రామిరెడ్డి సినిమాలలో తాగుడుకు బానిసై మరణించే పరిస్థితి ఏర్పడిందట.