ఎన్టీఆర్ చేసిన పనికి గుక్క పెట్టి… ఏడ్చేసిన లేడీ స్టార్ కమెడియన్..!!

టాలీవుడ్ స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్లో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అయితే తాజాగా సరళ ఓ ఇంటర్వ్యూ కు హాజరై తన జీవితం గురించి పలు ఆసక్తి విషయాలు తెలిపింది.” నాకు ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టం.

నేను 6వ తరగతి చదివే టైం లోనే ఆయనను చూడాలని ఓ రోజు ఇంటి ముందు నిలుచుని వేచి చూశాను. కానీ ఎన్టీఆర్ నన్ను చూడకుండా హడావిడిగా వెళ్లిపోవడంతో చాలా ఏడ్చేశాను. దీంతో విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. అప్పుడు నాకు మాటలు రాలేదు. ఆయన అంటే ఎంతో ప్రేమ, అభిమానంతో కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి. నేను వెళ్ళిన తర్వాత నా స్కూల్ ఫీజు ఆయనే పంపించాడు.

ఇంట్లో తెలిస్తే తిడతారని ఎవరికీ చెప్పలేదు. అలాగే 7వ‌ తరగతి ఉన్నప్పుడే నాకు గర్భిణి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచి నా కెరియర్ మొదలైంది. నాకు నలుగురు చెల్లెల్లు వారికి పెళ్లిళ్లు చేసి… వారి బాధ్యతలని నేనే చూసుకున్నాను. దీంతో నాకు పెళ్లిపై ఆలోచన రాలేదు”. అంటూ కోవై సరళ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి కూడా సహాయం చేస్తున్నట్లు తెలిపింది.