ఆ ఇండస్ట్రీ కూడా ఛీ, తూ! అనేసిందా.. తల పట్టుకుంటున్న పూజా హెగ్డే..

ప్రముఖ నటి పూజా హెగ్డే  గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు తరుపు పరిచయం అయింది అమ్మడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటిది ఈ మధ్య ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు రాక బాధపడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ రాధే శ్యామ్ ‘ సినిమా కూడా పూజా కి నిరాశ నే మిగిల్చింది.

నిజానికి ‘ రాధే శ్యామ్ ‘ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా చెలరేగిపోవొచ్చు అని ఆశ పడింది. అని ఆమె అనుకున్నది రివర్స్ అయ్యి కెరీర్ కష్టాలో పడిపోయింది. తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రావడం లేదు. సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘ కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా లో పూజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యి మన బుట్ట బొమ్మకి షాక్ ఇచ్చింది. దాంతో హిందీలో కూడా పూజా కి బ్రేకులు పడ్డాయి.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ హీరో గా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుండి కూడా తప్పుకుంది పూజా. ప్రస్తుతం సౌత్ నుండి ఎటువంటి ప్రాజెక్ట్ కూడా పూజా చేతిలో లేదు. ఇక నార్త్ లో ఒకే ఒక ప్రాజెక్ట్ తన ఖాతాలో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ ఫామ్ లో ఉన్న షాహీద్ కపూర్ ఒక యాక్షన్ త్రిల్లర్ మూవీ లో నటిస్తున్నాడు. ‘కోయి షాక్ ‘ అనే పేరుతో తెరకేకుతున్న ఈ సినిమా లో పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా పై పూజా చాలా ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి చివరికి ఈ బాలీవుడ్ సినిమా ద్వారా అయిన పూజా కెరీర్ సక్సెస్ వైపు తిరుగుతుందేమో.