నాగార్జున వేసుకున్న ఆ షర్ట్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ అనేవారు ధరించే బట్టల నుంచి చెప్పులు వరకు ప్రతిదీ కాస్ట్లీ గానే ఉంటాయి. వారు ఎప్పుడూ మిగతా వారి కంటే యునిక్‌గా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని వస్తువుల్లోనూ వారు ప్ర‌త్యేక‌త‌ చూపిస్తూ ఉంటారు. ధరించేవాచ్‌లు, మేకప్, హ్యాండ్ బాగ్స్, ఫోన్స్ ఇలా ఒకటేంటి ప్రతి దాన్ని యూనిక్ నెస్ తో పాటు ధర కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక అదే విధంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ ఏ డ్రెస్ వేసుకున్న పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయే విధంగా ఉంటాడు. 64ఏళ్ళ‌ వయసు వచ్చినా ఇంకా అదే యంగ్ లుక్‌తో గ్రీకు వీరుడిలా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శ‌త జయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న ష‌ర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతుంది. ఇదే షర్ట్ ను దాదాపు రెండేళ్ల క్రితం 2021 బిగ్‌బాస్ సీజన్ 5లో వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున వేసుకున్నాడు.

ఇది $1310డాలర్లు అంటే మన కరెన్సీలు రూ.83,980. ఇక ఆ రోజుల్లో ఈ షర్ట్ కాస్ట్‌ గురించి సోషల్ మీడియా గట్టిగానే న్యూస్ వైరల్ చేసింది. అయితే మళ్ళీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ ష‌ర్ట్‌లో కనిపించడం గమనార్హం. దాదాపు సెలబ్రిటీస్ అంతా ఎంత కాస్ట్ అయినా ఒకసారి ఈవెంట్లో వేసుకున్న కాస్ట్యూమ్ మరో ఈవెంట్లో రేపిట్ చేయడానికి ఇష్టపడరు. అలాంటిది నాగార్జున లాంటి స్టార్ హీరో ఏఎన్ఆర్ శ‌త జయంతి వేడుకల్లో రెండేళ్ల క్రితం వేసుకున్న షట్ ను ధరించి దర్శనం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం అంటూ నెటిజెన్లు క‌మెంట్ చేస్తున్నారు.