అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్…. అదేంటంటే….!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పుష్ప మూవీతో పెద్ద విజయం అందుకోవడంతో పాటు.. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

దీంతో అందరిలో పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ ని పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడ‌ట‌. ఇక ఈ మూవీ ని 2024 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు… ఇటీవల నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.

 

హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చే ఏడాది ఆగస్టు తరువాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్.