” బిగ్ బాస్ ” షో పై కేసు నమోదు…. తేల్చేసిన హైకోర్టు… అసలేం జరిగిందంటే….!!

మన తెలుగు బుల్లితెర స్క్రీన్ వద్ద భారీ సక్సెస్ అయినటువంటి షోల‌లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కూడా ఒకటి. మరి ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండగా… ఈ షో విషయంలో అయితే గత కొన్నాళ్ల కితం ఓ పిటిషనర్ హైకోర్టులో షోని నిలిపివేయాలని పిటిషన్ వేశారట. అయితే ఈ పిటిషన్ వేసిన వారికి న్యాయస్థానం దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

పిటిషనర్ వేసిన ఈ కేసును క్యాన్సిల్ చేశారని గతంలో కూడా పలు పిటిషన్లు వేయగా.. వాటి తోనే ఈ పిటిషన్ వేసుకోవాలని సూచించారట. దీనితో ఈ షో విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పొచ్చు. ఇక ఈ గ్రాండ్ రియాలిటీ షో కి కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ షో స్టార్ మా లో ప్లే అవుతున్న సంగతి కూడా తెలిసిందే.

మరి ఏడో సీజన్ మొదలయ్యి మూడో వారంలోకి కూడా అడుగుపెట్టేశారు. విచిత్రమైన టాస్కులతో.. గొడవలతో రసవత్తంగా సాగుతుంది బిగ్ బాస్. గతంలో నాగార్జున చెప్పినట్లే.. ఉల్టా పుల్టా ల సీజన్ సాగుతుంది. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యింది. మరియు మూడో వారం కూడా దగ్గరికి రావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.