టాలీవుడ్ అండ్ డైనమిక్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” నా సామిరంగ ” అనే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున మునుపెన్నడూ చూడని విధంగా కొత్త లుక్ లో కనిపించాడు.
ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మొత్తానికి ఈ సినిమా కోసం నాగార్జున మాస్ మేకొవర్లోకి మారిపోయాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త హైప్ పెంచేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈ మూవీలో మరో యంగ్ అండ్ డైనమిక్ హీరోకు కూడా ఛాన్స్ ఉందని టాక్. అయితే ఈ పాత్ర కోసం ఇటీవల అల్లరి నరేష్ పేరు వినిపించగా.. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు వినిపిస్తుంది.
మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు బిగ్ బాస్ తో అలరించడంతో పాటు… ఇటు సినిమాలతో కూడా అలరించడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగార్జున కెరీర్లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ” నా సామిరంగ ” మరి ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.