లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఏ దిక్కున ఉంచితే మంచిదో తెలుసా..?

చాలామంది ఎక్కువగా తమ ఇంట్లో ఏదో ఒక వస్తువులు తీసుకురావడం వంటివి జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ ను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు.. అయితే ఇలాంటివి వాస్తు దోషాలు పోవడానికి వ్యాపారాలలో మంచి లాభాలు పొందేందుకు లాఫింగ్ బుద్ధ అని పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇంతకీ లాఫింగ్ బుద్ధుడు ఏర్పాటు చేయడానికి సరైన స్థానం తో పాటు ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

Buy Gold Polyresin Premium Laughing Buddha Figurine at 29% OFF by The White  Ink Decor | Pepperfry

వేరువేరు రకాలలో ఉండే లాఫింగ్ బుద్ధాలు వేరువేరు రకాలుగా ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఆనందం సంపద ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయాలలోనే లాఫింగ్ బుద్ధను చేతులు పైకెత్తి ఉండేది మాత్రమే పెడుతూ ఉంటారు. ఈ లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టడం వల్ల ప్రశాంతత ఎక్కువగా లభిస్తుందని ప్రజల నమ్మకం.. ఇంటికి ప్రధాన ముఖ ద్వారం వద్ద లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంటికి సరైన శక్తి ఉత్పత్తి అయి సంపద కూడా పెరుగుతుందట. అయితే అది మన కంటికి కనపడేలా ఎత్తులో ఉంచాలి.

బుద్ధుడి బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల ఒత్తిడి దూరం అవ్వడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయట.ఇక పోతే ఇంట్లో ప్రవేశద్వారం వద్ద ఈ బొమ్మను ఉంచినట్లు అయితే.. వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాయట. వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధుడిని పడమర వైపు చూస్తున్నట్లుగా గదిలో కుడివైపున ఉంచితే ఆ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా సంపదతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందట. లేకపోతే ఏదైనా ఉద్యానవనం ఉంటే అందులో ఉంచడం చాలా మంచిదట.