విజయ్ మూవీ లో విలన్ గా అర‌వింద్‌ స్వామి.. ఏ మూవీలో అంటే..!!

దర్శకుడు వెంకట్ ప్రభ, తలపతి విజయ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాకి టెంపరరీ టైటిల్ గా ” తలపతి 68 ష‌ అనే టైటిల్ ని యాడ్ చేశారు. సినిమా యొక్క ప్రీ, ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సర్వేగంగా జరుగుతున్నాయి.

ఈ డిసెంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని మూవీ యూనిట్ తెలిపింది. తాజా సమాచారం ప్రకారం… ప్రముఖ హీరో అరవింద్ స్వామి “తలపతి 68 ” లో ప్రతి నాయకుడుగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ బిగ్ బడ్జెట్ మూవీలో విజయ్ డబల్ రోల్ చేయనున్నాడు. యువన్ శంకర్ రాజ్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రస్తుతం విజ‌య్ లియో సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయ‌టానికి ఎదురు చూస్తున్నాడు.