నాగార్జునతో కొట్లాటకు దిగిన వెంకటేష్.. అసలేం జరిగిందంటే….!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈయనకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా లేదు. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా కూల్ గా ప్రతి హీరోతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు. అలాంటి వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్ ఒకానొక సమయంలో తన చెల్లి విషయంలో నాగార్జునతో గొడవపడ్డాడట.

 

అసలు విషయంలోకి వెళితే… వెంకటేష్ చెల్లెలు లక్ష్మి దగ్గుబాటిని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. అప్పట్లో అక్కినేని నాగేశ్వర్ రావు, రామా నాయుడు మధ్య ఉన్న సన్నిహితం కారణంగా నాగార్జునని తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు.. కానీ.. కొంత కాలానికి నాగచైతన్య పుట్టిన తరువాత.. ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పార్ధాలు కారణంగా విడాకులు కోరుకున్నారు.

 

కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నాగార్జున, లక్ష్మీని కలపాలని వెంకటేష్ చాలా ప్రయత్నం చేశాడట. ఇక లక్ష్మికి కలవాలని ఉన్నప్పటికీ.. నాగార్జునకు మాత్రం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ప్రముఖ హీరోయిన్ అమలతో ప్రేమలో ఉన్నాడట. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ కి కోపం కట్టలు తెంచుకుని… నాగార్జునతో ఒక రేంజ్ లో గొడవకు వెళ్లాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.