ఆర్య సినిమా బబ్లూ గురించి తెలియని విషయాలు ఇవే..!!

చిత్రం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ బబ్లూ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాతో అందరికీ మరింత దగ్గరయ్యారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించిన బబ్లూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు రియంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

బబ్లూ మాట్లాడుతూ తన మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు సమయానికి తన వయసు 5 సంవత్సరలట. అందులో నాజర్ కొడుకుగా నటించానని .. 11 ఏళ్లకే సీరియల్స్ లో నటించానని తన అసలు పేరు సదా ఆనంద్.. సీరియల్ చేస్తున్నప్పుడు జంధ్యాల గారే బబ్లూ పేరు పెట్టడం జరిగిందట. ఇక అప్పటినుంచి ఆ పేరు తనకి స్థిరపడిపోయిందని తెలిపారు..బబ్లూ పదవ తరగతి చదువుతున్నప్పుడు చిత్రం మూవీలో నటించాను ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి అని తెలిపారు.

తన తండ్రి కూడా ఒక బాడీ బిల్డర్ అని తనకు కూడా సినిమాలలో నటించాలని చాలా కోరికగా ఉండేది..కానీ కుదరలేదని తెలిపారు. 2012లో తన తండ్రి చనిపోయాడని గత ఏడాది తన చెల్లి కూడా మరణించిందని ఈ ఏడాది జనవరిలో తన తండ్రి సోదరి కొడుకు కూడా చనిపోయారని ఇలా తనకు ఇష్టమైన వారంతా చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అప్పుడే ఆఫర్స్ కూడా వదిలేసుకున్నాను.. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళిపోయి రెండేళ్లకు పైగా అక్కడే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం సొంతంగా ఒక ప్రాజెక్టు కూడా చేస్తున్నానని అలాగే యాక్టింగ్ అకాడమీలో కూడా పనిచేస్తున్నానని తెలిపారు బబ్లూ.. పెళ్లి విషయానికి వస్తే లాక్ డౌన్ లో ఒక అమ్మాయిని ప్రేమించాడట. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాము త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో తన చెల్లి మరణంతో అది వాయిదా పడిందని తెలిపారు. త్వరలోనే వివాహం చేసుకుంటానని తెలిపారు బబ్లూ.