అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగ‌రు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!(వీడియో)

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుక‌లు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యుల‌తో పాటు.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజ‌రై.. అంబానీ ఫ్యామిలీతో క‌లిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు.

స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేశ్‌ దేశ్‌ముఖ్‌-జెనీలియా, లేడీసూపర్‌ స్టార్‌ నయనతార-విఘ్నేష్‌ శివన్‌, అతియా శెట్టి-కేఎల్‌ రాహుల్‌, స‌ల్మాన్ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌, జాన్వీ కపూర్, అలియా భట్, శ్రద్ధా కపూర్‌, మాధురిదీక్షిత్‌, పూజా హెగ్దే, రష్మిక మందనా, కరిష్మా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ త‌దిత‌రులు ఆంటిలియాలో క‌నిపించారు. అయితే అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం జ‌రిగింది.

చ‌క్క‌గా చీర‌లో అందంగా ముస్తాబై ర‌ష్మిక అంబానీ ఇంటికి వెళ్లింది. అయితే ర‌ష్మిక ఓ చోట నిల్చుని ఉంటే.. ఆమె వైపుకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వచ్చింది. శ్రద్ధాను చూసి రష్మిక స్మైల్ చేసినా.. ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు కొంత షాకైన రష్మిక.. పట్టించుకోలేదేంటీ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ర‌ష్మిక ఫ్యాన్స్ శ్రద్ధాపై సీరియ‌స్ అవుతున్నారు. ఎంత పొగ‌రు అంటూ ఆమెను ఏకేస్తున్నారు.