నిన్న ర‌జ‌నీ, నేడు నెల్స‌న్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రేంజ్ లో స‌క్సెస్ అయింది. ఈ మూవీతో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. మ‌రోవైపు జైల‌ర్ ఘ‌న విజ‌యంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఫుల్ ఖుషీ ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే జైల‌ర్ మూవీలో భాగ‌మైన వారికి స్పెష‌ల్ గిఫ్ట్స్ తో స‌ర్‌ప్రైజ్ లు ఇస్తున్నారు. నిన్న సూప‌ర్ ర‌జ‌నీకాంత్ కు ప్రాఫిట్స్‌లో కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. అలాగే బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారును గిఫ్ట్ గా ప్ర‌జెంట్ చేశారు. ఇక నేడు డైరెక్ట‌ర్ వంతు వ‌చ్చింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ కు నిర్మాత క‌ళానిధి మార‌న్ ఖ‌రీదైన ఓ సూప‌ర్ ల‌గ్జ‌రీ కారును కానుక‌గా ఇచ్చారు.

మొత్తం మూడు కార్ల‌ను దిలీప్ ముందు ఉంచి ఒక దాన్ని సెల‌క్ట్ చేసుకోమ‌ని నిర్మాత చెప్ప‌గా.. ఆయ‌న‌కు పోర్స్చే కారును ఎంచుకున్నారు. దాంతో ఆ కారు కీస్ ను కళానిధి మారన్ దిలీప్ కు అందించారు. అంతేకాదు, జైల‌ర్ లాభాల్లో కొంత వాటాను కూడా చెక్ రూపంలో డైరెక్ట‌ర్ కు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటో మ‌రియు వీడియోల‌ను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ‌ అధికారిక ట్విట్ట‌ర్ పేజీలో పంచుకున్నారు.