హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు అనుకోగా ఆ సినిమా నుంచి తప్పుకొని ఒకసారిగా షాక్ ఇచ్చింది.

Pooja Hegde starts dubbing for her Telugu film Ala Vaikunthapurramloo

దీంతో ఈ ముద్దుగుమ్మకి ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా కోసం సంప్రదించారని వార్తలు కూడా వినిపించాయి.. ఇప్పటివరకు ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ లేదు.. బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు కనిపించిన ఆ తర్వాత మళ్లీ ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ లో కూడా పూజ హెగ్డే కి పెద్దగా కలిసి రాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పూజ హెగ్డే కెరియర్ మళ్ళీ పెంచుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీల సైతం గ్లామర్ అందాలను వలకబోస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అందుకే పూజ హెగ్డే కూడా ఈ మధ్యకాలంలో తరచు గ్లామర్ ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు అక్కడక్కడ పలుషోలలో కనిపిస్తూ హైలైట్ గా ఉండేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మడికి హీరోయిన్గా ఏ చిత్రంలోనైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. లేకపోతే పూజ హెగ్డే కెరియర్ ఇక ముగిసినట్టే అని చెప్పవచ్చు.