సునీల్ ఇక టాలీవుడ్ ను వదిలేసినట్టేనా..?

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సునీల్ కొన్ని సినిమాలతో ఒక్కసారిగా డల్ అయ్యారు. ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సునీల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు రాలేదని చెప్పవచ్చు. పైగా కమెడియన్ గా చూసిన తర్వాత ఆడియన్స్ను ఇయని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూడలేకపోతున్నారు.

Which Tollywood movie star transformed so much for a role, you could not  recognize him/her? - Quora

దీంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసిన సునీల్ మొన్న శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన మహావీరుడు చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. జైలర్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించడంతో సునీల్ మంచి క్రేజీ అందుకున్నారు. ఇటీవలే విశాల్ నటించిన మార్కు ఆంటోనీ చిత్రంలో నటించిన ఇందులో కూడా నటనపరంగా మంచి మార్కులే పడ్డాయి.. ఇప్పుడు కార్తి నటిస్తున్న జపాన్ సినిమాలో కూడా కీ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు సునీల్.

సునీల్ చేతిలో ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కార్తీ జపాన్ సినిమా నవంబర్లో విడుదల కాగా మిగిలిన సినిమాల విషయానికి వస్తే బుల్లెట్, ఈగై అనే సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. పుష్ప-2 చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గుంటూరు కారం సినిమాలో పాటు గేమ్ చేజర్ సినిమాలు నటిస్తూ ఉన్నారు. సునీల్ తీర్పు చూస్తూ ఉంటే ఇకమీదట తమిళ సినిమాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.