అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బ‌స్ట‌రే.. భ‌లే ప్లాన్ వేసావ‌య్యా బోయ‌పాటి!!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద‌`. ఈ మూవీలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

శ్రీ‌నివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తున్న స్కంద‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రామ్‌, శ్రీ‌లీల బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా వీరిద్ద‌రినీ సుమ ఇంట‌ర్వ్యూ చేసిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను మాత్రం స్కంద ప్ర‌మోష‌న్స్ లో క‌నిపించ‌ట్లేదు. ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. బోయ‌పాటి గ‌త చిత్రం అఖండ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ టైమ్ లో పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల కార‌ణంగా బోయ‌పాటి అఖండ ప్ర‌మోష‌న్స్ కు హాజ‌రు కాలేక‌పోయాడు. కానీ, సినిమా మాత్రం పెద్ద విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేయాల‌ని బోయ‌పాటి ప్లాన్ వేశార‌ట‌. అందుకే స్కంద ప్ర‌మోష‌న్స్ లో ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఏదేమైనా బోయ‌పాటి న‌మ్మిన ఈ అఖండ సెంటిమెంట్ మ‌ళ్లీ రిపీటైతే స్కంద బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మ‌వుతుంది.