దెయ్యానికి వయసు అవుతుందా.. జుట్టు తెల్లబడుతుందా ఏంటి..?

గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి డాంగే కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్లు లారెన్స్ 2 షేడ్స్ లో కనిపించాడు. చంద్రముఖి పాత్రలో కంగనా రానౌత్ ఒదిగిపోగా… పార్ట్ వన్ లో మాద్రి గానే బనవయ్యగా మెప్పించిన స్టార్ కమెడియన్ వడివేలు.. మళ్లీ ఈ సినిమాలో అదే పాత్రలో కనిపించాడు.

 

17 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అంటూ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. నిజమైన చంద్రముఖి వస్తే ఎలా ఉంటుందనేది సినిమా కాన్సెప్ట్ కాగా.. దెయ్యాలకు వయసు అవుతుందా లేదా? ఘౌస్ట్లపై రీసెర్చ్ డైలాగ్స్ తో మూవీ హైప్ ను క్రియేట్ చేశారు.