హీరో విశాల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అభినయ..!!

హీరో విశాల్, నటి అభినయ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇద్దరు కూడా పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి..అయితే దీనిపైన నటి అభినయ ఇప్పటికే స్పందించడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Actor Vishal addresses marriage rumours with Abhinaya | Entertainment News  | Onmanorama

హీరో విశాల్ తో కలిసి ఇప్పుడు మార్క్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తున్నది అభినయ.. ఇందులో విశాల్ కి భార్య పాత్రలో నటించబోతోంది.. విశాల్ కు తాను పెద్ద అభిమానని ఆయనతో కలిసి పనిచేయడం ఆయన్ని కలవడం తన డ్రీమ్ అని కూడా తెలియజేసింద..ఇన్ని రోజులకు తన కల నెరవేరిందని అందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ కూడా తెలియజేసింది అభినయ.. చిన్నప్పటి నుంచి తనకు రజనీకాంత్ అంటే అభిమానమని ఆ తర్వాత విశాల్ ను అంతగా అభిమానించే దానిని తెలిపింది.

ఆయన నటించిన మొదటి చిత్రం ప్రేమ చదరంగం చూసి విశాల్ కి పెద్ద ఫ్యాన్ అయ్యానని.. కనీసం ఒక్కసారైనా ఆయనని కలవాలనుకున్నాను ఆయన నటించిన పూజ చిత్రంలో యాక్ట్ చేశాను కానీ ఆయన్ని కలవడానికి కుదరలేదని ఇన్ని రోజులకు అది కుదిరిందని తెలిపింది అభినయ..మార్కు ఆంటోని చిత్రంలో విశాల్ తో మొదటిసారి నటించాను ఈ చిత్రంలో ఆయన భార్యగా నటించాను ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మొదటిసారి విశాల్ కలిశానని దీంతో నా కల నెరవేరిందని తెలిపింది.. విశాల్ కి కోపం ఎక్కువ అనుకునే దాన్ని కానీ ఆయనను కలిసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలిసింది అంటూ తెలిపింది.

వివాహంపై క్లారిటీ ఇస్తూ విశాల్ తో పెళ్లి పై అవన్నీ ఒట్టి రూమర్సే అందులో ఏమాత్రం నిజం లేదు.. మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామంటూ రాస్తున్నారు అదంతా అవాస్తవమే.. ఈనెల మేము నటించిన మార్కు ఆందోళన చిత్రం ఈనెల 15న విడుదల కాబోతోంది అంటూ తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)