పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో..?

బిగ్ బాస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు సైతం పుట్టుకు రావడం జరిగింది.. అలా సీజన్-5 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచాడు మానస్.. గేమ్ పరంగా మానస్ , పింకి తో అడి అందరిని మెప్పించినప్పటికీ మరింత క్రేజ్ అందుకున్నారు. బుల్లితరపై సోషల్ మీడియాలో మానస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ లో నటిస్తుండగానే అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోలను సైతం చేస్తూ ఉండేవారు..ముఖ్యంగా విష్ణు ప్రియ తో కలిసి చేసిన జరి జరి పంచ కట్టే సాంగ్ మానస్ ను బాగా పాపులర్ అయ్యేలా చేసింది.

TV actor's engagement.. Video viral | Maanas Nagulapalli Engaged with Srija  Nissankara

దీంతో బుల్లితెర పైన మానస్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. తాజాగా మానస్ తన జీవితంలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. త్వరలోనే తను ఒక ఇంటివాడు కాబోతున్నట్లుగా తాజాగా తనకు సంబంధించిన నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.. మానస్ చేసుకోబోయే భార్య పేరు శ్రీజ నిశంకర్.. వీరి నిశ్చితార్థ వేడుకలు జరిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ జంటను చూసిన పలువురు నెటిజెన్లు సైతం చూడముచ్చటైన జంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇద్దరు కూడా పవర్ ఫుల్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ ఉండగా శ్రీజ లెహంగాలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరు కూడా చేతిలో చేయి వేసి మరి జంటగా నడుస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వీరి నిశ్చితార్థ వేడుకలకు సైతం సన్నీ, RG కాజల్, తదితరులు సైతం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మానసి ఫ్యాన్స్ పలువురి నెట్టిజెన్స్ సైతం వీరి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం అన్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే పెళ్లి తేదీని కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం.