టార్గెట్ 36: వైసీపీకి ‘రిజర్వ్’లో లీడ్.!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొదట నుంచి రాజకీయంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని శాసించగలరు. కేవలం రిజర్వ్ సీట్లలోనే కాకుండా.ఇంకా కొన్ని సీట్లలో సత్తా చాటగలరు. అయితే మొదట నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ఉండేవి. అప్పుడప్పుడు టి‌డి‌పికి మద్ధతుగా నిలిచేవి. కానీ మెజారిటీ మాత్రం కాంగ్రెస్‌కే ఉండేది. అయితే కాంగ్రెస్ దెబ్బతినడంతో వైసీపీకి మద్ధతు ఇస్తూ వస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఎస్సీ రిజర్వ్ సీట్లు 29 ఉంటే, ఎస్టీ సీట్లు 7 ఉన్నాయి. మొత్తం 36 సీట్లు రిజర్వ్. అయితే గత ఎన్నికల్లో ఎస్సీ సీట్లలో వైసీపీ 27 గెలుచుకుంటే టి‌డి‌పి 1, జనసేన 1 సీటు గెలుచుకుంది. ఇక 7కి 7 ఎస్టీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. దీంతో రిజర్వ్ సీట్లలో వైసీపీ బలం ఎంత ఉందో అర్ధమైపోయింది. అయితే ఇప్పటికీ ఆ సీట్లలో వైసీపీ బలం తగ్గడం లేదు. ఏదో కొన్ని సీట్లలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వల్ల వైసీపీకి మైనస్ అవుతుంది తప్ప..మిగిలిన సీట్లలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది.

29 ఎస్సీ సీట్లలో దాదాపు 20 సీట్లలో వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంది. ఏదో 6-7 సీట్లలోనే టి‌డి‌పికి బలం ఉంది. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుల్లోని ఎస్సీ సీట్లలో వైసీపీకి కాస్త గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయినా సరే వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది.

ఇటు 7 ఎస్టీ సీట్లు ఉంటే 7 సీట్లలో వైసీపీకి ఆధిక్యం ఉంది. కొద్దో గొప్పో ఒక్క పోలవరంలోనే వైసీపీకి టి‌డి‌పి కాస్త పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా చూస్తే రిజర్వ్ సీట్లలో వైసీపీదే హవా.