మెగా ఫాన్స్ కి రిలీఫ్ ఇచ్చిన ‘ భోళా శంకర్ ‘ ఫ్రీ రిలీజ్ టాక్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘ భోళా శంకర్ ‘. ఈ నెల 11న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ – చిరంజీవి చెల్లిగా నటించింది. శ్రీముఖి, అక్కినేని సుశాంత్, హైపర్ ఆది తదితరులు ఈ సినిమాలోకి నటించారు. కానీ హీరోయిన్ గా తమన్నా ఈ సినిమాలో నటిస్తునా ఆమె పాత్రకి ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదని ఆమె అసలు కనిపించినట్లే ఉండదని విమర్శలు వచ్చాయి.

అలాగే ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కార్యక్రమాలు పూర్తి చేసుకునా ఇంకా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించుకోవడంతో సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మెగా హేట‌ర్స్‌ ఈ సినిమాకు అంతా సీన్ లేదంటూ నెగిటివ్ టాక్ వైరల్ చేశారు. కానీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించింది.

ఇప్పటికే మెగా ఫాన్స్ లో ఏ సినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మూవీ బుకింగ్ జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హడావిడి నేపథ్యంలో మెగా ఫాన్స్ కు మరింత అంచనాలు పెరిగాయి. అదే విధంగా మంచి కలెక్షన్స్‌ని వసూలు చేస్తుందని.. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాలో జబర్దస్త్ ఆది కామెడీ వేరే లెవెల్ లో ఉండబోతుందట.