బిగ్ బాస్ 7 లో ఎంట్రీ ఇవ్వబోతున్న తల్లి కూతుళ్లు..!

టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాతో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు తన కూతురితో కలిసి ఎప్పుడు మోడల్ వేర్‌లో హంగామా చేస్తూ ఉంటుంది. తల్లి, కూతుర్లు కలిసి రీల్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

గ్లామరస్ ఫోటోలతో ఎప్పుడు సందడి చేసే సురేఖ‌ కూతురు సుప్రీతతో కలిసి అమెరికాలో అట్లాంటిక్ సిటీలో సందడి చేస్తుంది. ఫ్రెండ్షిప్ డే స్పెషల్‌గా సురేఖ వాణి ఈ వీడియోను తన కూతురితో పంచుకుంది. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా రాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్బాస్ సీజన్6 లోనే సురేఖ వాణి పార్టిసిపెంట్ గా రావాల్సింది కొన్ని కారణాల చేత ఆమె ఆ సీజన్లో ఆగిపోవాల్సి వచ్చిందట.

సురేఖ వాణి కూతురు సుప్రీత సినిమాల్లో హీరోయిన్గా అడుగు పెట్టబోతుంది. ఈ సమయంలో బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించడం ఎంతైనా అవసరం. కాబట్టి ఈసారి పక్కాగా బిగ్ బాస్‌కి సురేఖకు దరకపోయినా సుప్రతనైన పంపించాల‌ని అనుకుంటుందట. సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్‌7 ప్రారంభమవుతుందని సమాచారం.’