`భోళా శంక‌ర్‌` మూవీ స్టార్స్ రెమ్యున‌రేష‌న్.. ఒక్కొక్క‌రు గ‌ట్టిగానే ఛార్జ్ చేశారుగా!?

ఈ వారంలో రిలీజ్ కాబోతున్న పెద్ద చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ న‌టించింది. సుశాంత్‌, మురళీ శర్మ, రఘు బాబు, రావు రమేష్, శ్రీ‌ముఖి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ను పోషించారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ భోళా శంక‌ర్ బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. బిజినెస్ కూడా భారీ స్థాయిలో జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన స్టార్స్ రెమ్యున‌రేష‌న్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒక్కొక్క‌రు గ‌ట్టిగానే ఛార్జ్ చేశారు. హీరో అయిన చిరంజీవి భోళా శంక‌ర్ కోసం ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశార‌ట‌. అయితే ఇంత‌వ‌ర‌కు ఆయ‌న‌కు నిర్మాత ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు.

ఈ విష‌యాన్ని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. సినిమా విడుద‌ల త‌ర్వాతే చిరంజీవి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ త‌మ‌న్నా ఈ సినిమా కోసం రూ. 3 కోట్లు ఛార్జ్ చేయ‌గా.. సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేసిన కీర్తి సురేస్ రూ. 2 కోట్లు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంద‌ట‌. ఇక కీర్తి సురేష్ కు జోడీగా సుశాంత్ న‌టించాడు. అత‌నికి రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చార‌ని ఇన్‌సైడ్ టాక్‌.