గద్దర్‌పై కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన కరాటే కళ్యాణి.. బుద్ధుందా అంటూ!

ప్రజా కళాకారుడు, ఉద్యమ కళాకారుడు గద్దర్ తాజాగా గుండెకు సంబందించిన అనారోగ్యంతో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన పార్దివదేహానికి అధికారిక లాంచనాలతో నిన్న అంత్యక్రియలు జరిపించారు. గద్దర్ అంత్యక్రియలకు లక్షలాది మంది అభిమానులు వచ్చి ఘనంగా నివాళి అర్పించారు. అలానే ఆయనను చివరి చూపు చూడడానికి సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆయన మరణం గురించి అందరూ బాధపడుతున్న సమయంలో కరాటే కళ్యాణి గద్దర్ గురించి వివాదాస్పద పోస్ట్ చేసింది.

ఆమె పోస్ట్ చూసిన చాలామంది కళ్యాణి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కరాటే కళ్యాణి తన పోస్టులో ‘ బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల లాంటి ప్రముఖ గాయకులు మరణించినప్పుడు ఈ ఎర్ర బ్యాచ్ ఏమన్నారో నేను మర్చిపోలేను. వాళ్లల చనిపోయిన వాళ్లను తిట్టే సంస్కారం మాకు లేదు. ‘ అంటూ రాసుకొచ్చింది. దాంతో గద్దర్ అభిమానులందరూ కరాటే కళ్యాణిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. పీడత వర్గాల తరపున తన గళాన్ని వినిపించిన మహానీయుడు గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అంటూ కళ్యాణిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అసలు నువ్వు ఆడదానివేనా అంటూ ఆమెణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఎవరిని పడితే వారిని తిడతావ్. వాళ్లు ఎంతటి గొప్పవాళ్లయిన కూడా కేవలం ణి పబ్లిసిటీ కోసం ఎదుటివల్లని విమర్శిస్తే నీ అంతు చూస్తాం అంటూ కరాటే కళ్యాణ్ కి వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కుక్కతోక వంకర అన్నట్లుగానే ణి వంకర బుద్ధి ని చూపించుకుంటున్నావు అంటూ ఆమెకి గట్టిగ క్లాస్ పికుతున్నారు.