పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతగాడు వెరీ వెరీ టాలెంటెడ్. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. యూత్ ఆల్‌టైమ్ క్రష్. ఈపాటికే మీరు అతనెవరో అర్థమైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు అయిన ఫహద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.
వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అయినా కూడా వెనకడుగు వేయడలేదు. నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. విమర్శించినవారి దగ్గర నుంచే ప్రశంసలు అందుకున్నాడు. మలయాళ, తమిళ భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. జాతీయ అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ ను అందుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `పుష్ప ది రైజ్`తో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.
ఇందులో భన్వర్ సింగ్ షెకావత్‌గా అదరగొట్టేశాడు. `పార్టీ లేదా పుష్పా?` అనే ఒకే ఒక్క ట్రేడ్ మార్క్ డైలాగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం `పుష్ప 2`లో మెయిన్ విలన్ గా విశ్వరూపం చూపించబోతున్నాడు. రీసెంట్ గా తమిళంలో ఫహద్ మామన్నన్ (తెలుగులో నాయకుడు) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సౌత్ లో కెరీర్ పరంగా ఫహద్ దూసుకుపోతున్నాడు. అన్నట్లు ఈయన భార్య నజ్రియా నజీమ్. ఈమె ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.