వారికి చిరంజీవి సహాయం తప్ప అతని తప్పులే ఎందుకు కనిపిస్తాయో!

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే కష్టాలో ఉన్నవారికి సహాయం చెయ్యడం లో కూడా చిరు ముందుంటాడు. వైద్య సాయం, ప్రకృతి వైపరీత్యాలు, పరిశ్రామిక అవసరాలకు తన వంతు బాధ్యత నెరవేర్చడం, కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసరాల సరఫరా, ఆయన అభిమానులకు హెల్త్ కార్డులు, రక్తదానం, నేత్రధానం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

అయితే చిరు ఎంత సహాయం చేసినా కూడా కొంతమంది ఆయనను విమర్శిస్తూనే ఉంటారు. అసలు చిరంజీవి ఏంచేసాడు అంటూ ఆయన మిత్రులుగా నటిస్తున్న శత్రువులు చులకనగా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలో లేకపోయినా కూడా ఇప్పటికీ ఆయన్ని కొందరు విమర్శిస్తూనే ఉంటారు. అయితే చిరు అయనపై వస్తున్న విమర్శల గురించి అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని విమర్శలు వచ్చిన కూడా అవన్నీ విని చిరు స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిరు మాట్లాడుతూ ‘ నేను ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసానో అందరికి తెలుసు, అవన్నీ తెలిసి కూడా కొందరు నన్ను విమర్శిస్తూనే ఉన్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

‘అలానే సహాయం పొందిన వ్యక్తుల మనసుల్లో నేను ఉంటాను అదే నాకు చాలు. ఎవరో అన్న మాటలు పట్టించుకోని నేను నా మనసుని, మనశాంతి ని పాడు చేసుకోను. ఆ విమర్శలు నన్నేమి చెయ్యలేవు ‘ అంటూ ఆయన అన్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కొన్ని ఎవరికి తెలియవు అని కొంతమంది వాటిని వీడియోల రూపంలో బయటపెడుతుంట్టారు. మన ఇండస్ట్రీ లో చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల గురించి ఎవరు పొగడరు. కానీ వేరే భాషలో అయితే చిరంజీవి లాగా సేవా చేసే హీరోలు ఏం మాట్లాడిన ఏ పని చేసిన హైలెట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సేవా కార్యక్రమాలు చేసే వారి గురించి చెప్పడం వల్ల వాళ్ళను ఎక్కువమంది అభిమానిస్తారో అని చాలా మంది మనసులో కుట్రతో ఉంటారు. అలాంటి వారిని చిరంజీవి పట్టించుకోకుండా ఎదుటివారికి సహాయం చేస్తూనే ఉంటాడు.