బాలయ్య-ఎన్టీఆర్ లా స్టార్ హీరో కాలేకపోయిన కళ్యాణ్ రామ్.. కారణం తెలిస్తే కడుపు రగిలిపోతుంది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు నందమూరి హీరోలు . ఉన్నది ఉన్నట్లు చెప్పడం నిక్కచ్చుగా ముఖాన్నే మాట్లాడటం నందమూరి హీరోలకు మొదటి నుంచి అలవాటు. ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు నందమూరి బాలయ్య – ఎన్టీఆర్ . వీళ్లిద్దరూ ఉన్నది ఉన్నట్లు ఎలా మాట్లాడుతారో పలు ఈవెంట్ లో స్టేజిపై మనం చూసిందే . అయితే మరో హీరో కళ్యాణ్ రామ్ దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు .

కళ్యాణ్ రామ్ కి కోపం చాలా తక్కువ ..బాలయ్యతో ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తే మరింత తక్కువనే చెప్పాలి. అంతేకాదు కళ్యాణ్ రామ్ తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ ని కూడా బాధపెట్ట కూడదు అని ఇష్టం లేకపోయిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నా సరే ఆ సినిమాను చేసి ఆయన ఖాతాలను నెగిటివ్ మార్కు వేసుకుంటారట. మనల్ని నమ్మి ఇంటికి వచ్చిన వారిని డిసప్పాయింట్ చేయకూడదు అనేది కళ్యాణ్ రామ్ అభిప్రాయం .

అయితే మంచిని మంచి అని చెప్పడం.. చెడును చెడు అని చెప్పడం ముఖ్యం అనేది బాలయ్య – ఎన్టీఆర్ ల అభిప్రాయం . ఈ కారణంగానే బాలయ్య ఎన్టీఆర్ టాప్ హీరోలుగా ఎదిగారు . కళ్యాణ్ రామ్ ఇంకా స్టార్ హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ అంటే బాలయ్య – ఎన్టీఆర్ ఆ తర్వాత మోక్షజ్ఞ పేర్లు చెప్తారు ..కానీ కళ్యాణ్ రామ్ పేరు చెప్పరు అలాంటప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి కడుపు రగిలిపోతుంది అంటూ కూడా పలువురు నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!