బోళా శంకర్ కంటే జైలర్ సినిమాకే డిమాండ్ ఎక్కువ.. టికెట్ బుకింగ్స్‌ తెలుసుకుంటే..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో దాదాపు మూడు దశబ్దాలుగా నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో ఒకసారి రాజకీయాలోకి వెళ్లి పది సంవత్సరాలు వరకూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. పది సంవత్సరాల తరువాత ఖైది నెంబర్ 150 అనే సినిమా తో తిరిగి ఇండస్ట్రీ లోకి అడిగి పెట్టాడు. అలా రీ ఎంట్రీ తరువాత 5 సినిమా లో నటిస్తే వాటిలో మూడు సినిమాలు వంద కోట్ల రూపాయలు షేర్ మార్కును అందుకుంది.


అంత మంచి మార్కును సెట్ చేసిన చిరు ప్రస్తుతం దానిని చెడగొట్టుకుంటున్నాడు అంటూ అభిమానులు
వాపోతున్నారు. ఎందుకంటే చిరు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. అది మెగాస్టార్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. సాధారణ జనాలో కూడా చిరు సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది. దానికి ఉదాహరణే త్వరలో విడుదల కాభోతున్న ‘భోళా శంకర్’  సినిమా. ఈ సినిమా వచ్చే వారం విడుదల కాభోతున్నా కూడా ప్రేక్షకుల నుండి ఎటువంటి స్పందన లేదు. మొహార్ రమేష్ దర్శకత్వం వచిస్తున్న ఈ సినిమా 8 ఏళ్ళ క్రితం విడుదల అయిన తమిళ సినిమా ని రీమేక్ చెయ్యడం వళ్ల ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు అని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సిస్ రెండు తెలుగు రాష్ట్రలో మొదలయ్యాయి. అయితే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కంటే రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా కి మూడు రేట్లు ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. హైదరాబాద్ లో భోళా శంకర్ సినిమా కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్ మొన్ననే ప్రారంభించారు. హైదరాబాద్ లో టాప్ క్వాలిటీ థియేటర్స్ లో భోళా శంకర్ బుకింగ్స్ ని ఓపెన్ చేసిన్నప్పటికి 50% బుకింగ్స్ కూడా పూర్తి కాలేదు. ఈ సినిమా సరైన వసూలు సాధించకపోతే మెగా అభిమానులు నిరాశకు గురి కాక తప్పదు.