`చంద్రముఖి`గా కంగనా ఫ‌స్ట్ లుక్ చూశారా.. అందానికి కూడా అసూయ పుట్టాల్సిందే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిన `చంద్రముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్ర‌ముఖి 2 రాబోతోంది. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన పి. వాసునే సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తుంటే.. టైటిల్ పాత్ర‌ను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ పోషిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కంగ‌నా ఫ‌స్ట్ లుక్ ను చిత్ర టీమ్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తే అందానికి కూడా అసూయ పుట్టాల్సిందే. ఎందుకంటే చంద్ర‌ముఖిగా కంగ‌నా చంద‌మామ కంటే అందంగా మెరిసిపోతుంది.

ఆమె అందాన్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు కూడా చాల‌వు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఒంపుసొంపుల ఒలికిస్తూ కంగ‌నా చూపు తిప్పుకోకుండా చేస్తోంది. చంద్రముఖికి భయపడాల్సిన ఆడియన్స్ ఈ లుక్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు. ప్ర‌స్తుతం కంగ‌నా ఫ‌స్ట్ లుక్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, తొలి భాగంలో జ్యోతిక చంద్ర‌ముఖిగా విశ్వ‌రూపం చూపించింది. మ‌రి ఇప్పుడు కంగ‌నా ఆమెను డామినేట్ చేస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.