ఆ సీటులో టీడీపీ వర్సెస్ జనసేన..ఏం డిసైడ్ చేస్తారు?

టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ ఈ లోపే సీట్ల కోసం రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. సీటుని తాము దక్కించుకోవాలంటే..తాము దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన సీటు కోసం టి‌డి‌పి, జనసేనలు గట్టిగా పోటీ పడుతున్నాయి.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జోగి రమేశ్ పోటీ చేసి దాదాపు 62 వేల ఓట్లు దక్కించుకున్నారు. ఇటు టి‌డి‌పి నుంచి కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేసి 54 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ జనసేనకు 25 వేల పైనే ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీ గెలిచేది కౌడ్. ఇక ఈ సారి పొత్తు ఉంటుందని అంటున్నారు. దీంతో వైసీపీకి కాస్త రిస్క్ ఉంది. కానీ సీటు కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.

వాస్తవ పరిస్తితులు చూస్తే జనసేన కంటే టి‌డి‌పికి ఇక్కడ డబుల్ బలం ఉంది. కానీ జనసేన సపోర్ట్ ఉంటేనేన్ టి‌డి‌పి గెలవగలదు. అందుకే ఈ సీటు తమకే ఇవ్వాలని జనసేన నేతలు అంటున్నారు. బలం తమకుంది కాబట్టి సీటు తమదే అని టి‌డి‌పి నేతలు చెబుతున్నారు. అయితే టి‌డి‌పిలో ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ సీటు కోసం పోటీ పడుతున్నారు.

వీరిలో వీరికి రచ్చ నడుస్తుందని అనుకుంటే ఇప్పుడు జనసేన వచ్చి సీటు కావాలని అడుగుతుంది. దీంతో పెడన సీటు బాబు-పవన్ తేల్చుకోవాలి. కానీ సీటు ఎవరికి దక్కిన ఓట్లు షిఫ్ట్ అయ్యేలా లేవు. దీని వల్ల మళ్ళీ వైసీపీకే బెనిఫిట్.