బొమ్మ ప‌డ‌లేదు… అప్పుడే దుమ్మ లేపుతోన్న’ జైల‌ర్ ‘ వ‌సూళ్లు… ర‌జ‌నీయా మాజాకా…!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. విజ‌య్‌తో బీస్ట్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇదే కావ‌డం విశేషం. ట్రైలర్ తో ఒక్కసారిగా అదిరే హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్‌కు మ‌రో ఐదు రోజుల టైం ఉండ‌గానే యూఎస్ బుకింగ్స్ లో అదరగొట్టింది.

ఇప్ప‌టికే యూఎస్ బుకింగ్స్‌లో జైల‌ర్ 3 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు కొల్ల‌గొట్టింది. ఇవ‌న్నీ కూడా ప్రీమియ‌ర్ వ‌సూళ్లే కావ‌డ‌ విశేషం. ఇంకా రిలీజ్ కి, ప్రీమియర్స్ కి మ‌రో ఐదు రోజులు సమయం ఉంది. ఇప్ప‌టికే వ‌సూళ్లు ఇలా ఉండ‌డంతో ఫ‌స్ట్ డే 1 మిలియ‌న్ ఈజీగా క్రాస్ చేసేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఏదేమైనా ర‌జ‌నీ సినిమాయా మాజాకానా అనుకోవాల్సిందే.