నాగార్జునకి ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన నాగార్జున ఎప్పుడు కూడా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చివరిగా ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి పోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Seetaramaraju Movie || Changure Changure Video Song || Nagarjuna,Harikrishna  - YouTube

నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో అన్నా అని పిలిచే ఏకైక హీరో ఎవరో కాదు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణనే.. సీతారామరాజు సినిమాలో హరికృష్ణ నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ సమయంలో హరికృష్ణ నాగార్జున మధ్య బంధం చాలా బలపడిందట. ఒకానొక సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. అప్పటినుంచి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ కు కూడా మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. హరికృష్ణ మరణించినప్పుడు కూడా నాగార్జున చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Nagarjuna and Junior NTR Together - video Dailymotion

అందుచేతనే ఎన్టీఆర్ లో హరికృష్ణ ని చూసుకుంటూ ఉంటారని ఒకానొక సమయంలో తెలియజేయడం జరిగింది నాగార్జున. ఎన్టీఆర్ నాగార్జున కాంబినేషన్లు పలు సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేకపోయాయి. ప్రస్తుతం నాగార్జున ఒకో చిత్రానికి రూ .10 కోట్ల రూపాయలు రెమినరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున తరువాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో తన కెరియర్ బాగుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. నాగార్జున సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య కూడా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.