కేవలం ఆ హీరోయిన్ కోసం పబ్లిక్ ఫంక్షన్లో కొట్టుకున్న చిరు- నాగార్జున ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..!

టాలీవుడ్ లో గత నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతూ ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉండే వారిలో చిరంజీవి- నాగార్జున ముందు వరుసలో ఉంటారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య బుక్స్ ఆఫీస్ వార్‌ నువ్వా నేనా అనే రేంజ్ లో కొనసాగింది. అదేవిధంగా వీరిద్దరిలో ఎవరు గొప్ప అని ఒకప్పుడు పోలింగ్ కూడా జరిగింది. అంతటి పోటీ వాతావరణంలో కూడా వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు.

అదే సమయంలో కలిసి అప్పట్లో స్టార్ మా ఛాన‌ల్‌ని కూడా కొనుగోలు చేశారు కొన్ని రోజులు విజయవంతంగా నడిపించి ఆ తర్వాత ఛానల్ ను స్టార్ టీవీ వారికి అమ్మేశారు.ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే అప్పట్లో చిరంజీవి- నాగార్జున పబ్లిక్ ఫంక్షన్ లో ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు. ఇంతకీ ఆ గొడవ సీరియస్ గొడవ అనుకుంటే పొరపాటే.. సరదాగా కాసేపు చిన్న పిల్లల్లాగా ఇద్దరు ఆ హీరోయిన్ నాకు కావాలంటే నాకు కావాలి అంటూ గొడవ పడ్డారు.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ‘వజ్రోత్సవ వేడుకలు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన చిత్ర పరిశ్రమ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న‌ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ అద్భుతమైన ఈవెంట్ కి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. ఈ ఈవెంట్ జరిగే సమయంలో ఒకరోజు యాంకర్ సుమ నాగార్జున- చిరంజీవి మధ్యలో కూర్చున్న రమ్యకృష్ణ వద్దకు వెళ్లి మీరు చిరంజీవి గారితో నాగార్జున గారితో ఎన్నో సినిమాలు నటించారు కదా.. వారిలో మీకు ఎవరంటే బాగా ఇష్టమని అడుగుతుంది.

అదే సమయంలో చిరంజీవి నేనే అని నేనే అని అంటూ వస్తాడు.. అలాగే నాగార్జున కూడా కాదు నేనే ఎక్కువ ఇష్టమని కూడా అంటాడు.. నాతో ఎక్కువ సినిమాల్లో కూడా నటించిందని నాగార్జున కూడా అంటాడు. అదే విధంగా నాతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది అంటూ చిరంజీవి దానికి కౌంటర్ ఇస్తాడు. అలా ఆ స‌మ‌యంలొ వారిద్దరి మధ్య సరదాగా గొడవ పడటం చూసి నాకోసం ఇద్ద‌రు సూపర్ స్టార్స్ గొడవ పడుతున్నారు ఇంతకు మించి నాకు కావాల్సింది ఏముంటుంది అంటూ జవాబు ఇస్తుంది. ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్ ఎయ్యండి.