మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా గుర్తించుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్దాలకు పైగానే అవుతున్న మెగాస్టార్ గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను, హీరోలను తన తర్వాత చిత్ర పరిశ్రమకు అందించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారనే చెప్పాలి.
ఈ విషయం ఇలా ఉంచితే చిత్ర పరిశ్రమలో హీరోగా సక్సెస్ అవ్వాలంటే అన్ని రకాల సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేయాల్సిందే.. అప్పుడే ఆ హీరోకు సక్సెస్ వస్తుంది. అయితే ఇక్కడ మరి కొంతమంది మాత్రం ఈ ప్రయోగాల జోలికి అసలే వెళ్లరు.. కానీ చాలా మంది హీరోలు మాత్రం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఎన్నో ప్రయోగాలు చేస్తారు.. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఆయన హీరో గానేకాకుండా విలున్ గా కూడా ప్రేక్షకులను ఆలరించిన విషయం అందరికీిసిందే.
అయితే ఆయన హీరో, విలన్ గానే కాకుండా ఆయనలో దాగి ఉన్న మరో టాలెంట్ ఏమిటంటే ఆయన కొరియోగ్రఫీ కూడా చేయటం. ఇప్పుడు ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పలు సినిమాల్లో చిరంజీవి తన గొంతును వినిపించిన విషయం తెలిసిందె కానీ ఒక పాటకు కొరియోగ్రఫీ అందించడం అదే మొదటిసారి.. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో యండమూరి రచించిన మరణ మృదంగం నవల ఆధారంగా 1988 ఆగస్టు 4వ తేదీన మరణం మృదంగం అనే సినిమా ప్రేక్షకులుముందుకు వచ్చింది.
ఇక నిన్నటితో ఆ సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంగీత దర్శకుడు ఇళయరాజా, యండమూరి వీరేంద్రనాథ్ నిర్మాత, కేఎస్ రామారావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లుగా రాధా, సువాసిని నటించారు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలో వచ్చే గొడవే గొడవ అనే పాటకి చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ అందించారట. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.