ప్రపంచాని వణికించే రాజమౌళికి అది అంటే అంత భయమా..? కనిపిస్తే పరిగెత్తేస్తాడా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండియన్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకునేలా చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఇండియన్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని సైతం తీసుకొచ్చాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే .

కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. రాజమౌళి చాలా ADVENTURES సీన్స్ తెరకెక్కిస్తూ ఉంటారు. అదంతా గ్రాఫిక్స్ కి వరకే పరిమితం అంటూ తెలుస్తుంది . రాజమౌళికి కూడా అందరిలాగే ఓ విషయం అంటే చాలా భయం అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చాలామందికి పాములు చూడగానే భయం వేస్తుంది . పాములు చూడగానే పారిపోతారు . అయితే ఆ లిస్టులోకే వస్తాడు మన జక్కన్న . ఎన్నో సినిమాలకు అవార్డ్స్ అందుకొని తన పేరుని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తగ్గించుకునేలా చేసిన రాజమౌళి పాము అంటే చాలా భయమట. పొరపాటున ఎప్పుడైనా సరే షూటింగ్ సెట్స్ లో పాము వస్తే మాత్రం పరుగులు తీసేస్తాడట . అంతేకాదు ఆ దరిదాపుల్లో కూడా ఉండడట . ప్రొడక్షన్ టీం ఎవరైనా అక్కడున్న వాళ్ళ పామును తరిమేసే వరకు అసలు స్పాట్లోకి రాడట . అంతేకాదు పొరపాటున ఏదైనా సినిమాలో పాము చూసినా సరే ఆ రాత్రికి కచ్చితంగా కలలోకి పాము వస్తుందట . అందుకే మొదటి నుంచి రాజమౌళి పాము ఉన్న సినిమాలను ఎక్కువగా చూడరు అని ..అసలు అలాంటి సీన్ ఉందంటే కచ్చితంగా సినిమానే అవాయిడ్ చేస్తాడని చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!