రజినీకాంత్ క్రేజ్ అట్లుంటది మరి.. ఏకంగా ముఖ్యమంత్రులే అభిమానులు..

సాధారణంగా ముఖ్యమంత్రులకు వారి రాష్ట్రాల పరిపాలనతో సమయం గడిచిపోతు ఉంటుంది. ప్రజలు కోసం ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి ఉంటారు. అలాంటిది ముఖ్యమంత్రులు సినిమాల జోలికి అసలే వెళ్లారు. అంత సమయం కూడా వారికీ ఉండదు. వారికీ సినిమాలంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ప్రజా జీవితం కోసం దానిని త్యాగం చెయ్యక తప్పదు. అయితే ఒకో సందర్బంలో సినిమా చూడాలనే కోరిక వారిలో బలంగా ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త తీరిక చేసుకొని అయిన సినిమా చూడడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది ముఖ్యమంత్రులు ఒక సినిమా చూడడానికి పరితపించిపోతున్నారు.

ఆ సినిమా మారేదో కాదు బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ప్రేక్షకులను బాగా ఏంటర్టైన్ చేస్తున్న జైలర్ సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా చూడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట తమిళనాడు సీఎం స్టాలిన్ ‘జైలర్’ సినిమా ని చూసారు. ఆయనకు వ్యక్తిగతంగా రజినీతో ఉన్నా అనుబంధం కన్నా హీరోగా ఆయన అంటే ఉన్న ఇష్టం వల్ల సమయం కుదుర్చుకొని మరి షో వేయించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ త్రివేండ్రం లో ఉన్న పి వి ఆర్ మల్టీప్లెక్స్ కి తన కుటుంబం తో కలిసి వెళ్లి జైలర్ సినిమా చూసారు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కూడా జైలర్ సినిమా ని చూడాలని నిర్ణయించుకున్నారట.

ఇటీవలే హిమాలయ యాత్ర పూర్తి చేసుకున్న రజినీకాంత్, యోగి ఆదిత్యనాధ్ తో జైలర్ సినిమా చూడడం కోసం నిన్న లక్నో వెళ్లారు. స్వయంగా రజినీకాంత్ ఈ విషయం ని ఎయిర్పోర్ట్ లో వెల్లడించారు. దీనిబట్టి చూస్తే జైలర్ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం అవుతుంది. గతంలో రజినీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించాడు కానీ ముఖ్యమంత్రులు, ఏమ్మెల్యే ఇంత ఆసక్తి ఎప్పుడూ చూపించలేదు. ఇప్పటికే 500 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న జైలర్ సినిమా ఫైనల్ రన్ అయ్యేలోపు తమిళనాడు లో హైయెస్ట్ కలెక్షన్లు సంపాదించిన సినిమా గా నిలవడం ఖాయం అని బయ్యార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా దాదాపు మూడు రేట్లు ఎక్కువ కలెక్షన్ల ను ఖాతాలో వేసుకుంది జైలర్ మూవీ.