100 ఆస్కార్లు తీసుకొచ్చిన ఆ విషయంలో అనిల్ రావిపూడి ముందు రాజమౌళి వేస్ట్.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరా ..? అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు . కాగా ఈ దెబ్బతో రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటి సంపాదించుకుంది . అయితే రాజమౌళి వెయ్యి ఆస్కార్లు తీసుకువచ్చిన సరే అనిల్ రావిపూడి తో సరి సమానంగా తూగలేరు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

దానికి కారణం అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా తెరకెక్కిస్తూ ఉండడమే . రాజమౌళి ఎంతో మంది స్టార్ హీరోలను స్టార్ హీరోయిన్ లను డైరెక్ట్ చేశారు . కానీ నందమూరి బాలయ్యతో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేకపోయాడు . ఇకపై తెరకెక్కిస్తాడు అన్న నమ్మకం కూడా లేదు. గతంలో రెండు మూడు సార్లు ఆ ఛాన్స్ వచ్చినా.. వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది .

అయితే అనిల్ రావిపూడి మాత్రం బాలయ్యతో సినిమా చేయాలని పట్టు పట్టి పీడించి మరి ఆయన కాల్ షీట్స్ లాక్కున్నారు . అంతేకాదు ఆయన అనుకున్న పని ఆయన సాధించారు . ఈ క్రమంలోని అనిల్ రావిపూడి ఫ్యాన్స్ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు . రాజమౌళి ఇండస్ట్రీకి ఎన్ని ఆస్కార్లు తీసుకొచ్చిన అనిల్ రావిపూడితో సరి సమానంగా తూగలేరు అని అనిల్ రావిపూడి గట్స్ ముందు రాజమౌళి పిరికివాడి అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి అనిల్ రావిపూడి పేర్లు వైరల్ గా మారాయి..!!