రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేసిన రేణు దేశాయ్‌.. నా ద‌గ్గ‌ర ప‌దాలు లేవంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్ రేణు దేశాయ్ తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌మౌళి రూపొందించిన అద్భుత‌మైన చిత్రాల్లో బాహుబ‌లి ఒక‌టి. తెలుగు జాతి గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పిన సినిమా ఇది.

ఎపిక్ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన బాహుబ‌లి రెండు భాగాలుగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది. ఈ సినిమా ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన గౌరవం అందుకుంది. నార్వే దేశంలో గల స్టావెంజర్ థియేటర్ లో బాహుబలి ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి రాజమౌళి, రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. అలాగే రేణు దేశాయ్ మ‌రియు ఆమె కుమారుడు అకీరా నంద‌న్ కూడా బాహుబలి స్టావెంజర్ స్క్రీనింగ్ కు హాజ‌రు అయ్యారు.

ఈ అవ‌కాశాన్ని వారికి నిర్మాత శోభు యార్లగడ్డ క‌ల్పించారు. అక్క‌డ సినిమా వీక్షించిన అనంత‌రం రేణు దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. `ఒక ఇండియ‌న్ సినిమాను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. రాజ‌మౌళి సార్‌.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు మీరు తెర‌కెక్కించిన ఈ సినిమా అద్భుతం. దీని గురించి చెప్ప‌డానికి నా ద‌గ్గ‌ర ప‌దాలు లేవు. స్టావెంజర్ థియేటర్ లో బాహుబ‌లి చూసిన అనుభ‌వానికి ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ కార్య‌క్ర‌మానికి న‌న్ను, అకార‌ను అహ్వానించినందుకు శోభు సార్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్` అంటూ రేణు దేశాయ్ త‌న పోస్ట్ లో పేర్కొంది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది. అన్న‌ట్లు చాలా ఏళ్ల త‌ర్వాత రేణు `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`తో రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ మూవీతో మ‌ళ్లీ ఆమె బిజీ అవుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)