తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?

దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా స్మారక వందనాలు విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ ఆహ్వానం రాగ దేవర సినిమా షూటింగ్ కారణంగా ఢిల్లీకి వెళ్లలేకపోతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని పిలవకపోవడంతో అక్కడికి హాజరు కాలేదు.. ఎన్టీఆర్ మహాప్రస్థానం వద్దకు వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పుష్పాంజలి ఘటించారు.

గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు ,బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఎక్కడ కనిపించలేదు.. దీంతో వీరందరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి..ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 100 నాణెం విడుదలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు మాత్రం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ మాత్రం కేవలం తను సినిమాలలోని నటిస్తానని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ అధికార పగ్గాలు చేపడతారేమో చూడాలి మరి.