ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే సింపుల్ ఆహారం ఇదే… !

మనలో చాలామంది ఇమ్యూనిటీ పుష్కలంగా లేక బాధపడుతూ ఉంటాము. ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో చాలామందికి తెలియదు. ఇమ్యూనిటీ పెరిగే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మష్రూమ్ ఉతప్పం:
సౌత్ ఇండియాలోని ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ లో ఉతప్పం ఒకటి. అయితే పుట్టగొడుగులతో చేస్తే ఉతప్పం కచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మీ రోగ నిరోధిక శక్తిని పెంచుతుంది.

ఎగ్ పరోటా:
మీ రోగ నిరోధక శక్తిని పెంచి మరో బ్రేక్ ఫాస్ట్ ఎగ్ పరోట. కోడిగుడ్ల లోని ప్రోటీన్స్, విటమిన్స్ మీ ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి.

బట్టర్ మిల్క్:
బాడీని నేచురల్ గా కూల్ చేయడానికి బట్టర్ మిల్క్ సహాయపడుతుంది. అలాగే డ్రీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని ఎక్కువ క్యాలరీలు జీర్ణశక్తిని కాపాడుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

పన్నీర్ చీలా:
అధిక వెజ్ ప్రోటీన్, తక్కువ క్యాలరీలు ఉండే బ్రేక్ ఫాస్ట్ పన్నీర్ చీలా. దీనిలో క్యాల్షియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పెరుగన్నం:
పెరుగన్నంలో ఫైబర్, యాంటీ ఆక్సైడ్ లక్షణాలు ఉంటాయి. ఇదే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దానియా:
బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి దానియ బెస్ట్ ఆప్షన్. దీనిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.

రాగి ఇడ్లీ:
రాగిల్లో చర్మాన్ని కాపాడే పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలోని ఐరన్ మీ శక్తిని మరింత పెంచుతుంది. ఈ రాగిలతో తయారు చేస్తే ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయి.

నల్ల బొబ్బర్ల దోశ:
నల్ల బొబ్బర్లతో తయారు చేసే దోశ కూడా మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి.