బిగ్ బాస్ 7 `ఉల్టా ప‌ల్టా` కాన్సెప్ట్ లీక్‌.. ఈసారి ఒక‌టి కాదు రెండు హౌస్ లు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే తెలుగులో ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 7న ప్రారంభం కాబోతోంది. గ‌త రెండు సీజ‌న్స్ ఊహించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా కొత్త‌గా ప్లాన్ చేశారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజ‌న్ 7 స్టార్ట్ కాబోతోంది.

`ఎవరి ఊహకు అందని సీజన్ బిగ్‍బాస్ సీజన్ 7. అంతా ఉల్టా పుల్టా` అని గ‌త కొద్ది రోజుల నుంచి నాగార్జున తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు. దీంతో అంద‌రికీ సీజ‌న్ 7పై ఆస‌క్తి నెల‌కొంది. అదే స‌మ‌యంలో ఈ ఉల్టా ప‌ల్టా కాన్సెప్ట్ ఏంటా అని తెగ జుట్టు పీకేసుకుంటున్నారు. ఫైన‌ల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటో లీకైంది. ప్ర‌తిసారి ఒకే హైస్‌.. ఒకే షో. కానీ, ఆసారి అలా కాదు. రెండు హౌస్ లు.. ఒక షో. తాజాగా త‌మిళ బిగ్ బాస్ లేటెస్ట్ సీజ‌న్ ప్ర‌మో విడుద‌లైంది. అందులో హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ డ్యూయ‌ల్ రోల్ లో సంద‌డి చేశారు.

అయితే ఒక క‌మ‌ల్ హాస‌న్ బిగ్ బాస్ షో గురించి చెబుతుండ‌గా.. మ‌రో క‌మ‌ల్ హాస‌న్ `ఎప్పుడు అదే ఇల్లు, అంతేమంది కంటెస్టెంట్లు, అదే క‌న్ఫెష‌న్ రూమ్‌, అవే ట్విస్ట్ లు అందులో కొత్త‌ద‌నం ఏముంది` అంటూ సైట‌ర్ వేశాడు. దాంతో హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్‌.. `ఆసారి ఒక‌టే షో.. కానీ రెండు హైస్‌లు` అని చెబుతూ అంచ‌నాలు పెంచేశారు. అంటే ఒక‌టే షో అయినా.. వేర్వేరు రెండు హౌస్ లు ఉండ‌బోతున్నాయ‌ని క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ లో కొంద‌రినీ ఒక హైస్ లో.. మ‌రికొంద‌రిని ఒక హైస్ లో ఉంచుతూ బిగ్ బాస్ ఒక ఆట ఆడుకోనున్నార‌ని.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు కంటెస్టెంట్స్ ను అటు ఇటు మారుస్తూ ఉంటార‌ని తెలుస్తోంది. ఇక తెలుగులో `ఉల్టా ప‌ల్టా` క‌న్సెప్ట్ కూడా ఇదే అని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇది నిజ‌మా కాదా అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.