నాకు మెగా కాంపౌండ్ అక్కర్లేదు.. కుండబద్దలు కొట్టిన అల్లు అర్జున్..!

చిరంజీవి సినీ బ్యాగ్రౌండ్‌తో చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ హీరో అడుగుపెట్టిన వారిని మెగా కాంపౌండ్ హీరో గానే గుర్తిస్తారు. ఇలా నాగబాబు నుంచి ఇటీవల వచ్చిన వైష్ణవ తేజ్ వరకు అందరూ మెగా హీరోలు గానే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్‌గా యంగ్ హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పటికీ మెగా నీడ నుంచి బయటకు రావాలనుకోవడం లేదు.

ఆ అవసరం కూడా చరణ్‌కి రాలేదు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అసలైన మెగా వారసుడిగా చలామణి అవుతున్నాడు రామ్ చరణ్. ఇక అల్లు అర్జున్‌కి మెగా అభిమానులు చాలామంది అభిమానులుగా ఉన్నా.. అల్లు ఆర్మీ అంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా అతనికి ఉంది. మెగాస్టార్ నీడ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్. తనకంటూ సొంత‌ ఇమేజ్ ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఇక చిరంజీవి సినిమాల్లోకి రాకముందు నుంచే తన వంశం సినిమాల్లో ఉంది. 1954 నుంచి అల్లు అర్జున్ తాత రామలింగయ్య తర్వాత తండ్రి అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలో పని చేశారు. రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న తర్వాత చిరంజీవి స్టార్‌గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా గీత ఆర్ట్స్ పతాకంపై వచ్చిన సినిమాలతోనే చిరంజీవి కెరీర్ మ‌లుపు తిరిగింది. ఆ తర్వాతే స్టార్ట్ హోదా సొంతం చేసుకున్నారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడని చిరంజీవి గురించి చెప్పిన ఇందులో అల్లు ఫ్యామిలీ ప్రోత్సాహం చాలా ఉంది. వారి కారణంగానే చిరంజీవి స్టార్‌గా మారాడు అనడంలో సందేహం లేదు. ఇక తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండాలనుకోవడానికి అల్లు అర్జున్ కు ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ మెగా ఫాన్స్ వారిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్‌ గడిచాక తమకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది..

అది నాచురల్ ఒకరు విశేషంగా ఎదుగుతూ ఓ లెవెల్ కి వచ్చాక వాళ్ళు మన దగ్గర ఉండలేరని వారికి అర్థం అయిపోతుంది.. మనం ఒకరి కంటే తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉంటే పేరెంట్స్ మనల్ని బయటకు వెళ్లాలని కోరుకోరు.. కానీ మనం ఎదిగే కొద్దీ వాళ్లు బయటకు వెళ్లి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఇదంతా మనం ఎదిగే సైజ్ డిఫరెన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు రావాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా కామెంట్స్ చేశాడు. నాకంటూ సొంత బేస్ ఏర్పాటు చేసుకున్నా.. చిరంజీవి గారు ఏమీ అనుకోరు నన్ను అభిమానించే మెగా ఫాన్స్ ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ అంతా మెగా అభిమానులు కారు అంటూ చెప్పకనే చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.