ప‌క్క‌లోకి వ‌స్తేనే ఆఫ‌ర్ ఇస్తా అన్నారు.. కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ అను ఇమ్మాన్యుయేల్!

కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల ఉంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇంకాస్త ఎక్కువ ఉంది. ఎన్నో ఆశ‌ల‌లో రంగుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల‌ను.. అవ‌కాశాల పేరుతో లోబ‌ర్చుకుంటున్నారు. ప‌డ‌క సుఖం అందిస్తేనే ఆఫ‌ర్స్ ఇస్తామంటూ వేధిస్తున్నారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేక కొంద‌రు ఎదురిస్తుంటే.. కొంద‌రు లొంగిపోతున్నారు. ఇంకొందరు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడుస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళం విప్పుతూ పోరాటాలు చేస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కెరీర్ ఆరంభంలో ప‌క్క‌లోకి వ‌స్తేనే ఆఫ‌ర్ ఇస్తామ‌ని కొంద‌రు త‌న‌ను ఇబ్బంది పెట్టారంటూ అను స్వ‌యంగా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కార్తి స‌ర‌స‌న `జ‌పాన్‌` అనే మూవీ చేస్తోంది. దర్శకుడు రాజు మురుగన్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

సెప్టెంబ‌ర్ 30 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అను ఇమ్మాన్యుయేల్.. కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. `ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. ప‌డ‌క సుఖం కోసం న‌న్ను కొంద‌రు ఇబ్బంది పెట్టారు. కానీ, నేను వారికి ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. తెలివిగా త‌ప్పించుకున్నాను. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో మనం ఎదుర్కోవాలి. ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు ఫ్యామిలీతో చెప్పాలి. వాళ్ళ స‌పోర్ట్ తీసుకోవాలి.` అంటూ అను చెప్పుకొచ్చింది. దీంతో ఈమె వ్యాఖ్య‌లు కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.