‘బిగ్ బాస్ 7’ టెలికాస్ట్ టైమింగ్ ఫిక్స్…..!!

బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటి షో తాజాగా సీజన్ 7 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 7 లాంచింగ్ ఈవెంట్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. అలాగే ఈ సీజన్ టెలికాస్ట్ టైమింగ్స్‌ని స్టార్ మా వెల్లడించింది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుందని.. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు షో ప్రారంభమవుతుందని తెలిపింది. ఇక ఈ సీజన్ సెవెన్ కు కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించబోతున్నాడు. ఈసారి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. కంప్లీట్ గా కొత్త రూల్స్ తో డిజైన్ చేసిన షో ఎలా ఉండబోతుందో చూడాలి.