రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల సినిమాల ట్రెండ్ బాగానే కొనసాగుతోంది.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన చిత్రాలను విడుదల చేస్తే పుట్టినరోజు పలు రకాల స్పెషల్ డేస్ లకు అనౌన్స్మెంట్ చేస్తూ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ వంటివి చాలానే ఉన్నాయి. పురాణాలు పీరియాడికల్ సినిమాల కోసం ఎంత ఎఫెక్ట్ నైనా చాలా అద్భుతంగా చూపించడం జరుగుతోంది.

Watch Bhairava Dweepam Full Movie Online in HD Quality | Download Now

అప్పట్లో అలాంటివి ఏమీ లేని సమయంలో కూడా గ్రాఫిక్స్ తో అదరగొట్టేసిన చిత్రం భైరవద్వీపం ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే కాకుండా నటి రోజా కెరియర్ను కూడా ఒక్కసారిగా మలుపు తిప్పింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమయ్యింది. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బి వెంకటరామిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రంభ ఒక స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది 1994లో రిలీజ్ అయిన భైరవద్వీపం సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

 

పొలిటికల్ పరంగా రోజా బాలయ్య మధ్య కాస్త విభేదాలు వచ్చిన భైరవద్వీపం సినిమాలో వీరి రొమాన్స్ అప్పట్లో అందరిని ఆకట్టుకుంది.. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. ఇలా అన్ని బెప్పించ గలిగిన ఈ సినిమా ఈనెల 30వ తేదీన రిలీస్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా 4K ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి భైరవద్వీపం సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.