తారక్ కథతో రామ్ చరణ్ సినిమాపై డైరెక్ట‌ర్ బుచ్చిబాబు క్లారిటి..!!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఈ కథను ఎన్టీఆర్‌కి బుచ్చు బాబు వినిపించారని, అదే స్టోరీ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై బుచ్చిబాబు స్పందించారు. గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చింది.

కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడం ఆ ఎఫెక్ట్ బుచ్చిబాబు మూవీపై పడింది. గేమ్ చేజర్ షూటింగ్ పూర్తయిన తరువాతే బుచ్చిబాబు మూవీ షూటింగ్ చరణ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ తో పాటు ఈ కథ పై వస్తున్న పుకార్లపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవునున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. ఉప్పెన తరువాత ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగింది. కానీ ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్‌కి చెప్పిన కథతోనే రామ్ చరణ్ సినిమాలను బుచ్చిబాబు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ పుకార్లను బుచ్చిబాబు ఖండించాడు. ఎన్టీఆర్ సినిమా కథతో రామ్ చరణ్ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. రెండు వేర్వేరు కథలు అని పేర్కొన్నాడు. ఎన్టీఆర్‌తో తను సినిమా చేయాల్సిన మాట నిజమేనని, కానీ కొరటాల శివ సినిమా ఆలస్యం కావడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని చెప్పాడు. రామ్ చరణ్ తో సినిమా తరువాత ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తానని బుచ్చిబాబు పేర్కొన్నాడు. కంప్లీట్ గా రా, రెస్టిక్ కథతో చరణ్ మూవీని ఉంటుందని వెల్లడించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. హీరోయిన్‌తో పాటు ఇతర నటులలా వివరణ త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపాడు.